28 జనవరి, 2008

స్పృహ

కళ్ళే కాదు,
కలాలూ కలలు కంటాయ్.
నెగళ్ళే కాదు,
బయళ్ళూ జ్వలిస్తాయ్.
మల్లెలే కాదు,
మెదళ్ళూ వికసిస్తాయ్.
మెదళ్ళూ వికసిస్తాయ్,
పిడికిళ్ళకు,
అటూ ఇటూ నిలుస్తాయ్.

1 కామెంట్‌:

Krishna Chaitanya చెప్పారు...

లక్ష్మీ నారాయణ గారు..
మీ కవిత చాలా బాగుంది. మనిషి బిగించే పిడికిలికి, తన మెదడుకి, కలానికి మధ్య లింకు చూడగలిగాను కానీ వీటన్నిటికీ, జ్వలించే బయళ్ళకి మధ్య లింకు నాకు అర్ధం కాలేదు. అది కూడా తెలిస్తే కవిత భావం మొత్తం అర్ధమైనట్టు అనిపిస్తుంది. దయచేసి చెప్పండి.
కవితలో 'కలాలూ కలలు కంటాయ్', 'పిడికిలికి అటూ ఇటూ నిలుస్తాయ్' అనే వాక్యాలు బాగా నచ్చాయి.
రాస్తూ ఉండండి.. భావాలని బయటకి తీసుకువస్తూ ఉండండి.